సజావుగా..ఓట్ల లెక్కింపు జరగాలి | - | Sakshi
Sakshi News home page

సజావుగా..ఓట్ల లెక్కింపు జరగాలి

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

సజావుగా..ఓట్ల లెక్కింపు జరగాలి ● కౌంటింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఆకస్మిక తనిఖీ

● కౌంటింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఆకస్మిక తనిఖీ

పార్వతీపురం రూరల్‌: పట్టణ స్థానిక సంస్థల ఎన్నిక ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని కలెక్టర్‌, జిల్లా ఎన్ని కల అథారిటీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారుల ను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక పార్వతీపురం జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులతో కలిసి కౌంటింగ్‌ హాళ్ల నిర్మా ణం, మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను అణువణువూ పరిశీలించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయాలని, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని కఠినంగా నిరోధించాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి కౌంటింగ్‌ హాల్‌కు ఈవీఎంలు, బ్యాలెట్‌ పెట్టెల తరలింపు మార్గాలను పరిశీ లించిన ఆయన.. భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బందికి బల్లలు, తగినంత విద్యుత్‌ వెలుగులు, తాగునీటి సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియలో రవ్వంత పొరపాటు కు కూడా తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించా రు.

పోలింగ్‌ కేంద్రం బాధ్యత పీఓదే

మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సొంత నిర్ణయాలకు తావులేకుండా, ఎన్నికల నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక జూనియర్‌ కళాశాల మన్యం కళావేదికలో సోమవారం పీఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రి య పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని చెప్పారు. పోలింగ్‌ బూత్‌లో పీఓదే పూర్తి బాధ్యత అని, పోలింగ్‌ ప్రారంభం నుంచి బాక్సుల సీలింగ్‌ వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రంలో పీఓ మినహా ఇతరులు మొబైల్‌ ఫోన్లు వాడరాదని తేల్చిచెప్పారు. దొంగ ఓట్లకు చెక్‌ పెట్టేలా ఓటరు కార్డును క్షుణ్ణంగా పరిశీలించి, వేలికివేసిన సిరా ఆరిన తర్వాతే ఓటుకు అనుమతించాలన్నారు. సిబ్బంది పోలింగ్‌ రోజున గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, విధుల్లో ఎటువంటి సందేహాలు రాకుండా పీఓ హ్యాండ్‌బుక్‌ను విధిగా చదవాలని సూచించారు. పక్షపాతంతో వ్యవహరించి నా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈవీఎంల భద్రతపై అప్రమత్తం

ఈవీఎంల భద్రత విషయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదని, గిడ్డంగి వద్ద నిరంతర నిఘా కొనసాగాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ్‌న్‌. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేర కు నెలవారీ తనిఖీల్లో భాగంగా.. జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్‌ల భద్రతా గిడ్డంగిని సోమవారం ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గొడౌన్‌న సీల్స్‌, సీసీటీవీ కెమెరాల వ్యవస్థతో పాటు పోలీసు బందోబస్తును నిశితంగా పరిశీలి ంచారు. సంబంధిత రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసి, భద్రతా సిబ్బంది 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపలా కాయాలని ఆదేశించారు. గిడ్డంగిలో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడటంతో పాటు, యంత్రాలకు ఎలాంటి తేమ చేరకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక పరికరాలను ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement