అభ్యర్థి ఒక్కరే.. నామినేషన్లు మూడు..! | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థి ఒక్కరే.. నామినేషన్లు మూడు..!

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

అభ్యర్థి ఒక్కరే.. నామినేషన్లు మూడు..! ● ఒకే ప్రాదేశికానికి వేరువేరు పార్టీల నామినేషన్లు దాఖలు

బలిజిపేట: మండలంలోని పెదపెంకి–2 ప్రాదేశికానికి పెంకి పార్వతి మూడు వేరువేరు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైంది. ఆమె గతంలో ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, స్వతంత్ర అభ్యర్థినిగా మూడు నామినేషన్లు దాఖలు చేశారు. ఆమె తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు భార్య. పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఆయనకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేదు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి సమాచారాలు ఉండవు. నియోజకవర్గ ఎమ్మెల్యే విజయచంద్ర ఆయనను పక్కన పెట్టి మండలంలో వేరే వ్యక్తులతో రాజకీయాలు నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రాదేశిక ఎన్నికలు రావడం, ఎంపీపీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడం తెలిసిందే. వేణునాయుడు పెదపెంకి గ్రామానికి చెందిన వారవడం, పెదపెంకి–2ప్రాదేశికం బీసీ అవడంతో భార్య పెంకి పార్వతితో నామినేషన్‌ వేయించారు. అయితే మండల టీడీపీలో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచిన ఆయనకు ప్రాధాన్యం ఇచ్చి భార్య పార్వతికి పార్టీ బి–ఫాం ఇస్తారా అనేది ప్రశ్నార్థకం. ఇదే అనుమానంతో జనసేన, స్వతంత్ర అభ్యర్థులుగా ఆమె నామినేషన్లు దాఖలు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీ–ఫాంతో టీడీపీ గుర్తుతో బరిలో ఉంటారా? జనసేన బీ–ఫాంతో గ్లాసు గుర్తుతో బరిలో నిలుస్తారా? ఎవరూ ఆదరించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారా? అనేది వేచిచూడాల్సిందే.

దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.3లక్షల విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలు వై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు బొబ్బిలికి చెందిన భక్తులు సోమవారం రూ.3 లక్షల విరాళం సమర్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన చనమల్ల కనకరాజు, కమల కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆల య అధికారులను కలిసి రూ.3 లక్షల విరాళా న్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆల య మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ పర్యవేక్షకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు,శేష వస్త్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement