పురపోరులో ప్రచార హోరు | - | Sakshi
Sakshi News home page

పురపోరులో ప్రచార హోరు

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

పురపోరులో ప్రచార హోరు

పురపాలక ఎన్నికల సమరంలో ప్రచార పర్వం వేడెక్కింది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంటంతో అభ్యర్థులు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పార్వతీపురం పట్టణంలోని దుగరాజపేట 5, 6 వార్డుల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గడపగడపకూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పట్నాన సాయిశ్రీ, కౌన్సిలర్‌ అభ్యర్థులు కోరాడ వినీల, పతివాడ ఝాన్సీలతో కలిసి ఆయన ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ..నవంబర్‌ 1 ఆదివారం నాడు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను కోరా రు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న తమ పార్టీకి పట్టం కట్టాలని, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓటు ద్వారా తీర్పునివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడ్కో మా జీ చైర్మన్‌ జమ్మూన ప్రసన్నకుమార్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ యిండుపూరు గున్నేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు గొర్లి మాధవరావు, పార్టీ సీనియర్‌ నాయకులు గొర్లి శంకరరా వు, కోరాడ చిట్టి, ఇతర పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

–పార్వతీపురం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement