నగర పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పాలవలస ఇందుమతి సోమవారం పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి పాలవలస శ్రీరాములుతో కలిసి ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా పలు వార్డుల్లో పర్యటించి ప్రచారం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, మోసాలను వివరిస్తూ ఆమె ప్రచారం సాగింది. మంచిని గుర్తించి ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలను ఆమె కోరారు. 23వ వార్డు పరిధిలో కౌన్సిలర్ అబ్యర్థి బొత్స ప్రసాద్‌తో పాటు పాలవలస మణికంఠ ప్రచారంలో పాల్గొన్నారు.
–పాలకొండ


