ఔను..వారు సైకిల్‌ దిగిపోయారు.. | - | Sakshi
Sakshi News home page

ఔను..వారు సైకిల్‌ దిగిపోయారు..

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

ఔను..వారు సైకిల్‌ దిగిపోయారు..

గఖం రూరల్‌: తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి ఆదివారం భారీగా చేరికలు జరిగాయి. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని బొండపల్లి మండలం చినతామరాపల్లి గ్రామం నుంచి 90 కుటుంబాలు, దేవుపల్లి గ్రామం నుంచి మాజీ మంత్రి పడాల అరుణ మరిది పడాల అప్పలనాయుడు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు చేరాయి. అలాగే దత్తిరాజేరు మండలం చామాలపల్లి గ్రామం నుంచి 120 కుటుంబాలు అధికార టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అప్పల నరసయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసుగుచెంది తమ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోందన్నారు. తమను నమ్మి పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, అధికారంలోకి రాగానే భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో యువనేత బొత్స సాయి గురు నాయుడు, వైఎస్సార్‌సీపీ బొండపల్లి దత్తిరాజేరు మండలాల అధ్యక్షులు బొద్దల చిన్నమనాయుడు, రాపాక కష్ణార్జున, మాజీ ఎంపీపీలు చల్లా చలం నాయుడు, గేదెల సింహాద్రి అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, మహంతి రమణ, మాజీ సర్పంచులు ఫణీంద్రుడు, పిల్ల గురునాయుడు, ఏర్నిల రామనాయుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు

దత్తిరాజేరు, బొండపల్లి మండలాలకు 310 కుటుంబాలకు పార్టీ తీర్థం

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement