మభ్యపెట్టి కండువా వేశారు | - | Sakshi
Sakshi News home page

మభ్యపెట్టి కండువా వేశారు

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

మభ్యపెట్టి కండువా వేశారు

రామభద్రపురం: గ్రామానికి రోడ్డు వేస్తామన్నారు. పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇలా నమ్మబలికి టీడీపీ నాయకులు బొబ్బిలి కోటకు తీసుకెళ్లి ఎమ్మెల్యే బేబీనాయనతో టీడీపీ కండువాలు వేయించి మోసం చేశారని రామభద్రపురం మండలంలోని మిర్తివలస పంచాయతీ పరిధి కారేడువలస గ్రామానికి చెందిన గిరిజన ప్రజలు ఏకరువు పెట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అప్పికొండ నిర్మల ముందు వాపోయారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామానికి మంజూరైన రోడ్లు రద్దయ్యాయని చెబుతున్నారని రోడ్లు ఎప్పుడు వేస్తారని అడిగితే టీడీపీ నాయకులు మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నాయకుల మాటలు నమ్మి కండువాలు వేసుకుని మోసపోయామని, ఇక నుంచి అలా జరగకుండా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇస్తూ మీ వెంట నడుస్తామని చెప్పారు. దీంతో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అప్పికొండ నిర్మల, తారాపురం ఎంపీటీసీ అభ్యర్థి వెక్కుడు సింహాచం, ,గ్రామ సీనియర్‌ నాయుకుడు పొట్టంగి రామాంజనేయులు ఆధ్వర్యంలో కారేడువలస గ్రామంలో 30 కుటుంబాల వారు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికీ నిర్మల పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కొర్లజన్ని గంగన్నదొర, కోనేపు పార్వతమ్మ, కారి శంకరరావు, కొర్ల జన్ని పైడమ్మ, కోవెల నాగన్నదొర, సింగారపు అక్కమ్మ, బడ్నాన లక్ష్మి, కారి గంగన్నదొర, బడ్నాన రాజారావు కొట్టిశ సూరమ్మ, ఆదిలక్ష్మి, బడ్నాన దుర్గారావు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయుకులు కోట వెంకటరమణ, మజ్జి బాలకృష్ణ, పిల్లా రమణ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాల గిరిజన ప్రజలు

కండువాలు వేసి ఆహ్వానించిన పార్టీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అప్పికొండ నిర్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement