శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించండి : ఐజీ | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించండి : ఐజీ

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

పాలకొండ: ఎన్నికల వేల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐజీ గోపీనాథ్‌ జెట్టి సూచించారు. శనివారం సాయంత్రం పాలకొండ పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ఆయన పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ప్రతి విషయంలోను ముందస్తు సమాచారం ఉంచుకోవాలని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించాలని సూచించారు. నామినేషన్లు పక్రియ విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో నగర పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల నియమాల మేరకు సిబ్బంది నడుచుకోవాలని, అల్లర్లు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆయనతో పాటు ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ రాంబాబు ఉన్నారు.

ప్రశాంత వాతావరణంలో

పోలింగ్‌ నిర్వహించాలి

పార్వతీపురం రూరల్‌: రాబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం పార్వతీపురం స్థానిక పోలీస్‌ అతిథిగృహంలో ఆయన ఎన్నికల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక మొబైల్‌ పార్టీలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి, అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, థామస్‌రెడ్డి, సీఐలు వెంకట్రావు, రంగనాథం రాంబాబు, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

పార్వతీపురం: ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైతే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య, అత్యవసరాలు, బలమైన కారణాలు ఉంటే తప్ప విధుల నుంచి మినహాయింపులు ఉండవని తెలిపారు. తప్పుడు కారణాలతో మినహాయింపులు కోరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌

జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ ఆర్చిత్‌ రహార్‌ తెలిపారు. అక్టోబర్‌ 27 నుంచి 30 వరకు కంట్రోల్‌ రూమ్‌ నిరంతరం పని చేస్తుందని పేర్కొన్నారు. తుపాను పరిస్థితులు, నష్టాల సమాచారాన్ని సేకరించేందుకు సిబ్బందిని సిఫ్ట్‌ల వారీగా నియమించినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించడానికి 7993240754ను కేటాయించినట్టు తెలిపారు.

వైభవంగా శ్రీ చక్ర స్నానం

గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి శ్రీ చక్ర స్నాన మహోత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేష అర్చనలు, హోమాలు, చూర్ణోత్సవం, స్నపనం తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సందడి నముడు పవిత్ర నాగావళి తీరంలో శ్రీచక్ర స్నాన మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. దీంతో నదీతీరం భక్తులతో సందడిగా మారింది. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, స్వామివారి సేవకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement