అంత్యక్రియల్లో పాల్గొని అనంత లోకాలకు... | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియల్లో పాల్గొని అనంత లోకాలకు...

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

కొమరాడ: నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన మనవడితో పాటు ఆయన స్నేహితుడు దుర్మరణం పాలైన ఘటన మార్కొండపుట్టి గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని మార్కొండపుట్టి గ్రామానికి చెందిన కలిపిండి నారాయణమ్మ(80) శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. నారాయణమ్మ కుమారుడు కలిపిండి శ్రీనివాసరావు విశాఖపట్నంలో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నారాయణమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చాడు. నారాయణమ్మ అంత్యక్రియలు పూర్తయిన తరువాత వృద్ధురాలి సామగ్రిని స్థానికంగా ఉన్న దుమ్మలవాని చెరువులో కలిపేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన తరువాత కుమారుడు, మనవడితో పాటు స్నేహితులు మొత్తం ఐదుగురు చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మనవడు తమరాపు భరత్‌(20), స్నేహితుడు సుభాష్‌ సాయిష్‌(17) చెరువులో లోతైన ప్రాంతంలో కూరుకుపోయి పైకి రాలేకపోయారు. దీంతో వీరిద్దరూ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లారు. వీరిద్దరినీ రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా రోదనలతో కన్నీటి సంద్రమయ్యింది. విషయం తెలిసిన ఎస్‌ఐ జగదీస్‌నాయుడు తన సిబ్బందితో చెరువు వద్దకు వెళ్లి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

సాయిష్‌ (ఫైల్‌)

భరత్‌(ఫైల్‌)

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement