పార్వతీపురం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తెలుసుకోవచ్చునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను ముందుగానే పరిశీలించుకొని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను సులభంగా తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.


