వేపాడ: మండలంలోని సోంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లబిల్లి గుణశేఖర్ అండర్ – 17 బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎమ్ బీపీఏ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందాల్ భారతీ విద్యామందిర్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన గుణశేఖర్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్. గోవిందరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


