నమ్మించి మోసగించే వారికి బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసగించే వారికి బుద్ధి చెప్పండి

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

విజయనగరం: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోసకారి హమీలు ప్రకటించి నమ్మించి మోసగించిన కూటమి నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. వచ్చే నెల 1న జరగనున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ తరఫునమేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోలగట్ల శ్రావణితో పాటు 18, 19, 20, 21 డివిజన్‌లకు సంబంధించి గౌడు వీధిలో.. 22, 23, 24, 25, 26 డివిజన్‌లకు సంబంధించి దాసన్నపేట రధం వీధి జంక్షన్‌లో... 27, 28, 34, 35, 36, 37,38 డివిజన్‌లకు సంబంధించి స్థానిక ఫోర్ట్‌సిటీ స్కూల్‌ జంక్షన్‌లో ఏర్పాట చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోలగట్ల శ్రావణితో పాటు, డివిజన్‌లలో కార్పొరేటర్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నమ్మించి మోసం చేసిన వారు ఓట్లు అడిగేందుకు వస్తే ప్రశ్నించాలని సూచించారు. 2024 సంవత్సరంలో రూ.1400 ఉన్న 25 కేజీల బియ్యం ధర నేడు రూ.2200 పలుకుతోందని, పంచదార కేజీ రూ 40 నుంచి రూ.60కి పెరిగిందని ఇలా అన్ని నిత్యావసరాల ధరలు పెరగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదన్నది ఆలోచించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌ బాబు మాట్లాడుతూ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో దుష్టపాలన సాగుతుందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రూ.500 కోట్లతో విజయనగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న వాఖ్యల్లో నిజం లేదని, అవన్నీ కాగితాలకే పరిమితమని తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్లి చంద్రబాబ, పవన్‌కళ్యాణ్‌ల పేరిట ఇచ్చిన బాండ్లు ఎంత వరకు అమలు చేశారో ప్రజలే గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమ పాలన సాధ్యమని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో సాధ్యం చేసి చూపించారని గుర్తు చేశారు. కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ సామాన్యులకు పెద్దలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, రాష్ట్ర కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలపై నిత్యావసరాల భారం

శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌

కోలగట్ల

వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమ పాలన : బెల్లాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement