● శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య
బొండపల్లి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సత్తా చాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సూచించారు. మండలంలోని బిల్లలవలస గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ నెట్టి ఏసురత్నంతో పాటు టీడీపీ నాయకుడు నెట్టి ముకుంద తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వైఎస్సార్‌సీపీ నియోజకవర్గంలో రోజురోజుకూ బలపడుతుందని, కూటమి మాయలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎత్తుగడలను స్థానిక సంస్థల ఎన్నికల్లో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు బొద్దల చిన్నంనాయుడు, మాజీ ఎంపీపీ చల్లా చలంనాయుడు, సాలాపు పెంటంనాయుడు, సిరిపురం నాయుడుబాబు, మాజీ ఎంపీపీ లెంక సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన 15 కుటుంబాలు..
చీపురుపల్లి: మండలంలోని పేరిపి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం సమక్షంలో 15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. గ్రామానికి చెందిన ఉండ్రాళ్ల రాము, శ్రీను, పట్నాన కనకరాజు, మీసాల శ్రీను, మీసాల గౌరునాయుడు, మీసాల రామకృష్ణ, పెనుమజ్జి మహేష్, బాగు అప్పన్న, ఎలకల సూర్యనారాయణ, సురేష్, తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరాడ పృథ్వి, ఎంపీటీసీ అభ్యర్థి లెంక రాజారావు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి 51 కుటుంబాలు..
బొబ్బిలి: మండలంలోని రంగరాయపురం ఒకటో వార్డు పెంకి వీధికి చెందిన 51 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రంగరాయపురానికి చెందిన మాజీ సర్పంచ్ గేదెల లక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు కోట గోవిందరావు, నారాయణరావు, సౌజన్యల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి పార్టీ మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెంకి ఆనందరావు, పెంకి ప్రవీణ్‌కుమార్, పెంకి కృపారావు, పెంకి సుందరరావు, పెంకి దాసు, పెంకి కిరణ్, విజయమ్మ, సరోజనమ్మ, సత్తెమ్మ తదితరులున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు వంగపండు శ్రీరాములనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


