అయోడిన్‌ ఉప్పునే వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

అయోడిన్‌ ఉప్పునే వినియోగించాలి

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

అయోడిన్‌ ఉప్పునే వినియోగించాలి

● డీఎంహెచ్‌ఓ జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: ప్రతి ఒక్కరూ అయోడిన్‌ ఉప్పునే వినియోగించాలని డీఎంహెచ్‌ఓ జీవనరాణి సూచించారు. శనివారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద గ్లోబల్‌ అయోడిన్‌ లోప రుగ్మతల నివారణ వారోత్సవాలను పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శరీర ఎదుగుదలకు, మెదుడు అభివృద్ధికి, థైరాయిడ్‌ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్‌ ఎంతో అవసరమన్నారు.

అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. గర్భిణులు అయోడిన్‌ కలిగిన ఉప్పును ప్రతిరోజూ తగిన మోతాదులో వినియోగించడం వల్ల శిశువు మెదడు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ పీఓఓ డాక్టర్‌ రఘవంశీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement