జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సుధీర్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సుధీర్‌

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బిడ్డిక సుధీర్‌ ఎంపికై నట్లు ఆ పాఠశాల పీడీ నిమ్మల మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఈనెల 10 నుంచి 12 వరకు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న సుధీర్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని, ఈనెల 27 నుంచి 31 వ తేదీ వరకూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉమారియాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళ్లనున్నట్లు తెలిపారు. జాతీయ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని పీడీ ప్రోత్సహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement