వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి

● శాసన మండలి విపక్షనేత

బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి

బొండపల్లి: స్థానిక సంస్దల ఎన్నికల్లో గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున నిలబడిన అభ్యర్దుల విజయానికి కృషి చేయాలని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, బొత్స అప్పలనరసయ్యలు కోరారు. ఈ మేరకు మండలంలోని జె.గుమడాం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు మంత్రి నారం నాయుడు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరగా పార్టీ కండువా వేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి పాలనలో వారిలో వారు కుమ్ములాడుకోవడం తప్ప, ప్రజల సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మరో రెండున్నర సంవత్సరాల కాలంలో పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి ఎదురు చూస్తున్నారని, అలాగే స్దానిక సంస్దల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్దులకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ జిల్లా అద్యక్షుడు బెల్లాన చంద్ర శేఖర్‌ మాజీ ఎంపీపీ చల్లా చలం నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొద్దల చిన్నంనాయుడు, సాలాపు పెంటం నాయుడు, మంత్రి గోవింద, ములపర్తి రమణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సాఆర్‌సీపీలో చేరిన కూటమి నాయకులు

భామిని: మండల కేంద్రానికి చెందిన కూటమి కార్యకర్తలు టీడీపీ,జనసేన మధ్య రగులుతున్న తగాదాలను భరించలేక శుక్రవారం వైఎస్సాఆర్‌సీపీలో చేరారు. భామినికి చెందిన కూటమి నాయకులు పోతల రాంబాబు, గౌడో మోహన, పోతల కిశోర్‌, గుర్జాపు జగదీష్‌ శ్రీరామ్‌ మధు, బాదాపు సురేష్‌, శ్రీరామ్‌ హరికృష్ణల ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైఎస్సాఆర్‌సీపీలో చేరాయి. ఈ మేరకు పార్టీలో చేరిన కూటమి నాయకులకు పాలకొండ మాజీ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భామిని వైఎస్సాఆర్‌సీపీ నాయకులు గేదెల మోహన, పోతల మజ్జి,రొక్కం రమేష్‌, బొమ్మాళి సంజీవ్‌, పోతల హరికృష్ణల సారథ్యంలో వారంతా పార్టీలో చేరారు.

వైఎస్సార్‌సీపీలో చేరికలు

సాలూరు: మున్సిపాలిటీలోని వివిధ వార్డుల నుంచి నాయకులు, ప్రజలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. 16వ వార్డు నుంచి దాసరి అచ్చయ్య, తదితర సుమారు 43 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరాయి. 6 తదితర పలు వార్డుల నుంచి అనేక కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఽ గెలుపే ధ్యేయంగా అందరు సమష్టిగా సమన్వయంతో పనిచేయాలని రాజన్నదొర త సందర్భంగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement