ఎన్నికల కోడ్‌ వీరికి పట్టదా? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ వీరికి పట్టదా?

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా కేంద్రంలో కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కంటి విభాగం వద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌కు సంబంధించిన ఫ్లెక్సీలో పీఎం మోడీతో పాటు, సీఎం చంద్రబాబు, విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్‌ల ఫొటోలు కూడా ఉన్నాయి. వాటికి ఎటువంటి ముసుగులు వేయలేదు. ఇదిచూసినా వారంతా ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు.

పైడితల్లి అమ్మవారి జాతరకు వైద్య శిబిరాలు

విజయనగరం ఫోర్ట్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా పట్టణంలో 6 చోట్ల 24 గంటల పాటు ఉచిత వైద్య సేవలు భక్తుల సౌకర్యార్థం వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితో ప్రత్యేక ప్రఽథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. జీవనరాణి తెలిపారు. పట్టణంలోని ఆరు ప్రధాన ప్రాంతాల్లో ఆక్టోబర్‌ 26, 27తేదీల్లో 24 గంటల పాటు ఉచిత ప్రఽఽథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, కోట జంక్షన్‌ బస్‌ షెల్టర్‌, పైడితల్లి అమ్మవారి ఆలయం లోపల ఎగ్జిట్‌ పాయింట్‌, గుమ్చీ జంక్షన్‌, దాసన్న పేట రోడ్డు వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో ఉదయం 8గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మూడు షిఫ్టుల్లో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆశ కార్యకర్తలు సేవలందిస్తారని తెలిపారు. అవసరమైన ప్రథమ చికిత్స మెడికల్‌ కిట్లను సంబంధిత పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ముందుగానే సరఫరా చేస్తారని తెలిపారు.

సరస్‌ మేళా ప్రారంభం

విజయనగరం ఫోర్ట్‌: అఖిల భారత డ్వాక్రా బజార్‌ (సరస్‌ మేళా)ను స్థానిక మాన్సాస్‌ గ్రౌండ్‌లో సెర్ప్‌ సీఈఓ వాకాటి కరుణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా చేనేత హస్త కళ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు సరస్‌ మేళాలో ఏర్పాటు చేశారని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

బుర్రకథ కళాకారుడి ఆత్మహత్య?

గంట్యాడ: మండలంలోని బూడిపేట గ్రామానికి చెందినిఽ బుర్రకథ కళాకారుడు దూళి.లక్ష్మణరావు(42) బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మణరావు బుర్రకఽథలు చెబుతూ జీవనం సాగిస్తుస్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్య అశ్వినికి, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. రెండో భార్య గౌరికి ఒక పాప ఉంది. కరోనా సమయంలో గౌరి అనారోగ్యంతో మృతి చెందడంతో, అప్పటి నుంచి లక్ష్మణరావు డిప్రెషన్‌కు గురై తన రెండో భార్య కుమార్తెతో కలిసి విశాఖపట్నంలోని కొమ్మాది ప్రాంతంలో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల20న దసరా పండగ సందర్భంగా అయన స్వగ్రామానికి వెళ్తానని చెప్పి విశాఖపట్నం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో కొర్లాం టోల్‌ ప్లాజా వద్ద తోటలోని నేల బావిలో లక్ష్మణరావు విగతజీవిగా శుక్రవారం కనిపించాడు. స్థానికుల సమాచారంతో మొదటి భార్య అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదిక తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement