విజయనగరం/విజయ
నగరం క్రైమ్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు అందించే ప్రసాదాలను జిల్లా ఆహార భద్రత అధికారిణి ఎస్.ఈశ్వరి శుక్రవారం పరిశీలించారు. ప్రసాదాల తయారీలో పరిశుభ్రత, నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, నాణ్యతా విశ్లేషణ నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. భక్తులకు నాణ్యమైన, సురక్షితమైన ప్రసాదాలను అందించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఆహార భద్రతాధికారి పి.శ్రీనుతో పాటు జిల్లా ఆహార భద్రతాధికారి కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


