ఆటో బోల్తా: 9 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 9 మందికి గాయాలు

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

ఆటో బోల్తా: 9 మందికి గాయాలు

● ఒకరికి తీవ్రగాయాలు

● శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలింపు

సీతంపేట: మండలంలోని సవరగొయిది గ్రామ ఘాట్‌ రోడ్‌లో ఆటో బోల్తా పడిన సంఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారిలో ఆటోడ్రైవర్‌ మహేష్‌కు తీవ్రగాయలవడంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి స్వల్పగాయలవగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సూపరెంటెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఒడిశాలోని గజపతి జిల్లా జమ్మి, నేరడి గ్రామానికి చెందిన వారు సీతంపేట మండలంలోని కోడిశ గ్రామానికి ఆటోలో 14 మంది బయలు దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆటో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై ఎస్సై వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement