పార్వతీపురంలో వానొస్తే చెరువు.. | - | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో వానొస్తే చెరువు..

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

పార్వతీపురంలో వానొస్తే చెరువు..

సుమారు 79,000 జనాభా, 13,059 గృహా లున్న పార్వతీపురం మున్సిపాలిటీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డంపింగ్‌ యార్డ్‌ తరలింపు, సురక్షిత తాగునీరు, మెరుగైన రహదా రుల నిర్మాణం చేపడతామన్న కూటమి పాలకుల హామీలు ఏళ్లు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. మున్సిపాలిటీ పరిధిని 30 నుంచి 36 వార్డులకు విస్తరించారు తప్ప.. మౌలిక సదుపాయాల కల్పనలో కించిత్‌ మార్పు కూడా కానరావడం లేదు. కనీస అవసరమైన తాగునీరు సక్రమంగా అందక పట్టణవాసుల గొంతెండుతోంది. కుళాయిల్లో వస్తున్న నామమాత్రపు బురద నీటిని సీసాల్లో నింపుకుని, మహిళలు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనలు తెలుపుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

●మరోవైపు, ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చిన్నపాటి చినుకు పడినా రహదారులు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. వర్షం వస్తే పలు వీధులుజలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.

●వీధిదీపాలు వెలగక రాత్రివేళ పలు కాలనీలు అంధకారంలో మగ్గుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

●ఇక పాలనా పరంగా చూస్తే.. మున్సిపల్‌ కార్యాలయంలో నెలకొన్న తీవ్ర సిబ్బంది కొరత వ్యవస్థను కుంగదీస్తోంది. ప్రధాన విధులకు సంబంధించిన అధికారుల కుర్చీలు ఖాళీ గా దర్శనమిస్తుండడంతో పాలనా యంత్రాంగం పనితీరు పూర్తిగా కుంటుపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement