జియ్యమ్మవలస రూరల్: జిల్లాలో జరగనున్న స్థానిక ఎన్నికల నిర్వహణకు పూర్తి భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 800 మంది పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, మూడంచెల భద్రత, పెట్రోలింగ్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 250 బైండోవర్ కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతర్ జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళికి ఎలాంటి ఆటంకం జరగకుండా అడిషనల్ ఎస్పీ డీఎస్పీల పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్సై ప్రశాంత్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


