స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్వతీపురం మండలానికి సంబంధించి స్థానిక జీజే కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రతిపాదిత స్ట్రాంగ్‌ రూమ్‌లను సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత రహార్‌ (ఐఏఎస్‌) గురువారం పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అక్కడ కల్పించాల్సిన వసతులను, ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రెవెన్యూ, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. భద్రతాపరంగా ఎలాంటి లోపాలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పలువురు స్థానిక అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement