బలిజిపేట: మండలంలోని వెంగాపురం గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 80కుటుంబాలు గురువారం చేరాయి. మాజీ ఎమ్మెల్యే జోగారావు సమక్షంలో వారు పార్టీలో చేరగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ రెబల్ ఎంపీటీసీగా నామినేషన్ వేసిన అలమండ ఈశ్వరి, ఆమె భర్త వెంకటరమణలతో సహా 80కుటుంబాలవారు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బి–ఫాం వెంకటరమణకు ఇవ్వనున్నామని పార్టీ తరఫున ఈశ్వరి అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో, నిస్వార్థంగా పనిచేసి టీడీపీకి సేవలు అందించిన వెంకటరమణకు ఆపార్టీ ఇచ్చిన ప్రాధాన్యత మీకు తెలిసిందేనన్నారు. వెంకటరమణకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీగా ఈశ్వరి విజయానికి అందరూ సహకరించాలని కోరారు. ఇకపై గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో అలమండ వారి కుటుంబాలు 22, గంట దాలినాయుడు కుటుంబాలు 15, వేమిరెడ్డి అప్పలనాయుడు(వైఏ నాయుడు) కుటుంబాలు 10, మరడాన అప్పలనాయుడు, పకీరునాయుడు కుటుంబాలు 10, కిల్లాడ తవిటినాయుడు కుటుంబాలు రెండు, రెడ్డి శ్రీను కుటుంబీకులు ఐదుగురు, దత్తి సత్యంనాయుడు కుటుంబాలు నాలుగు, అల్లు శివుడునాయుడు కుటుంబాలు నాలుగు, పూడు గౌరునాయుడు కుటుంబాలు ఐదు, యాదవకులానికి చెందిన ఏకల సింహాచలం కుటుంబాలు 5 ఉన్నాయి. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, మాజీ జెడ్పీటీసీ రవికుమార్, కె.గోపినాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాదరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ పి.శ్రీనివాసరావు, బలిజకార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బర్లిలో 10 కుటుంబాలు
బర్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు గులిపల్లి లక్ష్మునాయుడు, గ్రామానికి చెందిన మరో పది కుటుంబాల వారు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆయనకు, ఇతర కుటుంబాల వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ బర్లి స్థానానికి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సూచించారు. పార్టీ బి–ఫాం అందించనున్నట్లు తెలిపారు. లక్ష్మునాయుడును ఎంపీటీసీగా గెలిపించాలని బర్లి గ్రామంలో పార్టీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, మాజీ జెడ్పీటీసీ రవికుమార్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ప్రసాదరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, పి.నారాయణరావు, మహేష్ మాస్టారు, బి.కృష్ణ, జి.శంకరరావు, జి.గంగయ్య, సత్యారావు, మాధవనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
జియ్యమ్మవలసలో 30 కుటుంబాలు
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని తాళ్లడుమ్మ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముప్పర్తి నారాయణరావు ఆధ్వర్యంలో 30 టీడీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి గురువారం వైఎస్సార్‌సీపీలో చేయాయి. ఈ మేరకు చినమేరంగిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల నాయకులు పాల్గొన్నారు.


