జిల్లాలో 120 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 120 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

జిల్లాలో 120 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ● 800 మంది పోలీసులతో స్థానిక ఎన్నికలకు బందోబస్తు ● ఎస్పీ మాధవరెడ్డి

● 800 మంది పోలీసులతో స్థానిక ఎన్నికలకు బందోబస్తు ● ఎస్పీ మాధవరెడ్డి

వీరఘట్టం/పాలకొండ: జిల్లాలో 120 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం వీరఘట్టం, పాలకొండ మండల పరిషత్‌ కార్యాలయాల్లో జరుగుతున్న ఎంపీటీసీల నామినేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 45 సమస్యాత్మక గ్రామాలలో 300 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, తమ సిబ్బంది ఆ గ్రామాలపై నిఘా ఉంచారన్నారు.ఎన్నికలు పూర్తయిన తర్వాత నవంబర్‌ 5న సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజక వర్గ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని, కురుపాం నియోజకవర్గానికి సంబంధించి ఉల్లిభద్ర వద్ద ఉన్న ఉద్యానవనశాఖ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మూడంచెల భధ్రతా ఏర్పాట్లు..

నవంబర్‌ 3న జరగనున్న ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 800 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్లు దశలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఆయనతో పాటు పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, పాలకొండ సీఐ ప్రసాదరావు, వీరఘట్టం, పాలకొండ, దోనుబాయి ఎస్సైలు ఎస్‌.షణ్ముఖరావు, డోల వెంకన్న, శంకరావులు ఉన్నారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి

పాలకొండ: ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్పీ ఎస్‌వి మాదవ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పాలకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement