మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

మెరుగైన వైద్యం అందించాలి

● జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. వైశాలి

కొమరాడ: గిరిజన విద్యార్థినుల ఆరోగ్యం, సంక్షేమంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందించడంపై అధికారులు ప్రత్యే క దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. వైశా లి సూచించారు.ఈ మేరకు ఆమె గురువారం కొమరాడ మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ వైద్య సేవలు, పారిశుద్ధ్యం, మందుల నిల్వలు, వైద్య పరికరాలు, సిబ్బంది హాజరు, రోగుల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్య మైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, గ్రామీణ ప్రజల ఆరోగ్య పరి రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఉలిపిరి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలిక ల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన విద్యార్థి నుల ఆరోగ్యం, ఆహారం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులు, అధికా రులకు సూచించారు. పాఠశాలలోని వంటగది, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేసి, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థినుల్లో ఎవరికై నా అనారోగ్య లక్షణాలు కనిపి స్తే వెంటనే వైద్య సహాయం అందించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థినులకు సురక్షితమైన, ఆరోగ్యకరమై న వాతావరణం కల్పించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో వైద్యాధికారులు, పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement