వైఎస్సార్‌సీపీలో 50 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 50 కుటుంబాల చేరిక

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

బొబ్బిలిరూరల్‌: మండలంలోని శివడవలస గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ శంబంగి వెంకట చినప్పలనాయుడు సమక్షంలో గురువారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ మేరకు పక్కి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి స్వగృహంలో వారంతా పార్టీలో చేరగా పార్టీ కండువాలను కప్పి అందరినీ శంబంగి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.శివడవలస మాజీ సర్పంచ్‌ పెద్దింటి శంకర్రావు, మాజీ ఎంపీటీసీ శంబంగి సుధాకర్‌ ఆధ్వర్యంలో టీడీపీ అసంతృప్తి వాదులంతా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ విధానాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా జనరల్‌ సెక్రటరీ శంబంగి వేణుగోపాలనాయుడు, శంబంగి అనిల్‌కుమార్‌, కోట వంశీ, కోట వాసు, పెద్దింటి మాధవ, శంబంగి కృష్ణ, శంబంగి రమేష్‌, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement