● వైభవోపేతంగా కోటదుర్గమ్మ తిరువీధి
పాలకొండ రూరల్: శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన వేళ... మేళతాళాలు, భక్తుల భజనలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ అమ్మవారి తిరువీధి కార్యక్రమం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. సింహవాహనంపై శోభాయాత్రగా వచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. కరుణించమ్మా.. కోటదుర్గమ్మా అంటూ ప్రార్థించారు. అమ్మవారి దివ్వప్రసాదాన్ని రూ.40వేలకు పట్టణానికి చెందిన శ్రీనివాసరావు అనే వర్తకుడు దక్కించుకున్నారు.


