అభివృద్ధి చేస్తాం.. ఆదరించండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేస్తాం.. ఆదరించండి

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

● వడమలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి

ఇందుమతి ప్రచారం

పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పాలవలస ఇందుమతి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వడమ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను తెలియజేశారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు మూడేళ్లు పూర్తికావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హమీలనే అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి అండగా నిలిచి ప్రజలకు మంచి చేసేందుకు దోహద పడాలని విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement