అదనపు ఎస్పీ సౌమ్యలతకు ఘనంగా వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

అదనపు ఎస్పీ సౌమ్యలతకు ఘనంగా వీడ్కోలు

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

అదనపు ఎస్పీ సౌమ్యలతకు ఘనంగా వీడ్కోలు

విజయనగరం టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా బాధ్యతలు నిర్వహించి, నాన్‌కేడర్‌ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి బదిలీ అయిన పి.సౌమ్యలతకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే పరిపాలనాపరమైన విధులు, పోలీసు అధికారులు, సిబ్బందికి అప్పగించిన బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరాలకనుగుణంగా తగిన సూచనలు, ఆదేశాలు జారీచేస్తూ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని ప్రశంసించారు. బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ తాను జిల్లాలో పనిచేసిన సమయంలో ఎస్పీలుగా పనిచేసిన అధికారులందరూ అందించిన సహకారం, విధినిర్వహణలో సిబ్బంది చూపిన అంకితభావం మరువలేనన్నారు. జిల్లాలో బొబ్బిలి డీఎస్పీగా, ఇంటెలిజెన్స్‌ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేయడం మధురస్మృతిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసుశాఖ ఆమెకు పుష్పగుచ్ఛం, జ్ఞాపికలు అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించింది, కార్యక్రమంలో డీఎస్పీలు ఎస్‌.లక్ష్మణరావు, ఎస్‌.రాఘవులు, ఆర్‌.గోవిందరావు, పలువురు సీఐలు, పోలీసు కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement