సీతానగరం: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు, 15 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండల కేంద్రంలోని స్థానిక ఎన్నికల నిర్వహణ కేంద్రాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడం, మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నియోకవర్గం స్థాయిలో శాంతిభద్రలు నిర్వహిం చడానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి కవ్వింపు చర్యలనైనా నిలువరించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే పోలింగ్ కేంద్రల్లో అనుసరించాల్సిన విధాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డిఎస్పీ సీహెచ్‌వీ శేషయ్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. అప్పలనాయుడు, సహాయ ఎన్నికల అధికారులు ఎంఎల్‌ఎన్ ప్రసాద్, కె.ప్రసన్నకుమార్, ఎస్సై ఎం.హేమలత, డిప్యూటీ ఎంపీడీఓలు కె.కుమారవర్మ, ఎం.శివప్రసాద్, మండల పరిషత్ ఏఓ వెంకటరావు పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి


