బాలగుడబలో పది కుటుంబాలు | - | Sakshi
Sakshi News home page

బాలగుడబలో పది కుటుంబాలు

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

పార్వతీపురం రూరల్‌: మండలంలోని బాలగూడబ గ్రామానికి చెందిన పది కుటుంబాల సభ్యులు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు సమక్షంలో వారు పార్టీలో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జనసేన నుంచి వంగపండు నవీన్‌న్‌, గంగాడ ఆదినారాయణ, భోగి రవితేజ, గంగాడ వాసు, టీడీపీ నుంచి వంగపండు సత్యనారాయణ, గంగాడ శంకరరావు, వర్రి శంకరరావు, సూరిబాబులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ.. పార్టీలో అందరికీ తగిన సముచిత స్థానం, గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల సత్యంనాయుడు, మాజీ సర్పంచ్‌ పండు, మాజీ ఉపసర్పంచ్‌ వర్రి శ్రీనివాసరావు, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement