జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన 70వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అంతర్‌ జిల్లాల అండర్‌–17 తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన కె.సాహిత్య, డి.ప్రియవల్లి, ఎం.సాధ్విక, ఆర్‌.తేజస్విలు జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ఎస్‌.వాణి, శ్రీను, జిల్లా ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు, న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వేణుగోపాలరావు క్రీడాకారులను అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement