సైకిల్‌ మరి తొక్కలేం బాబూ..! | - | Sakshi
Sakshi News home page

సైకిల్‌ మరి తొక్కలేం బాబూ..!

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

సైకిల్‌ మరి తొక్కలేం బాబూ..!

● వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

● పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

● స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి

చేద్దామని నాయకుల పిలుపు

● 21ఎస్‌ఎల్‌ఆర్‌61 బి–పార్టీలోకి చేరిన తూరుమామిడి గ్రామస్తులు

వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకులు

డెంకాడ: మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కంది సూర్యనారాయణ, అక్కివరం మాజీ సర్పంచ్‌ కంది కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు జనసేన పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో బుధవారం చేరారు. వారికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త గదల సన్యాసినాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు బొత్స చైతన్య, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి తమ్మునాయుడు, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దత్తిరాజేరు మండలంలో 30 కుటుంబాలు

దత్తిరాజేరు: మండలంలోని ఆర్‌.రామచంద్రపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో గురువారం చేరాయి. పార్టీలో చేరిన వారికి గజపతినగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన తూమురోతు కృష్ణ. బొత్స చిన్నారావు కష్ణ తదితరులు మాట్లాడుతూ హామీలు అమలు చేయక పోవడంతో కూటమిపాలనపై విసుగుచెంది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు బేత రవి మాజీ ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు పలు గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ బలోపేతమవుతోంది. అధికార కూటమి పక్షాలకు చెందిన పలువురు నాయకులు, గ్రామస్తులు టీడీపీ, జనసేనలను వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీలో చేరుతున్న వారంతా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన పార్టీ మారుతున్నామని, స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తామని చెబుతున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీలో చేరిన వారి వివరాలిలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement