అమరుల త్యాగాలు..సమాజానికి స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలు..సమాజానికి స్ఫూర్తిదాయకం

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

అమరుల త్యాగాలు..సమాజానికి స్ఫూర్తిదాయకం

పార్వతీపురం రూరల్‌: పోలీసు అమరవీరుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తి దాయకమని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. 1959లో లడఖ్‌లో ప్రాణాలు కోల్పోయిన 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పాటు, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన జిల్లాకు చెందిన ముద్దాడ గాంధీ, చిట్టిపంతుల చిరంజీవి, షేక్‌ ఇస్మాయిల్‌, బి.శ్రీరాములు, కె.సూర్యనారాయణలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆధునిక సవాళ్లు, సైబర్‌ నేరాలను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అంతకుముందు ఏఆర్‌ ఆర్‌ఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసుల కవాతు, గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు చదివి వినిపించారు. అనంతరం అమరుల సతీమణులు మనోరంజని, ప్రమీల, రాజు తదితర కుటుంబ సభ్యులతో కలెక్టర్‌, ఎస్పీ సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, పండ్లు, నగదు అందజేశారు. ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ సచిన్‌అర్చిత్‌ రహర్‌, డీఎస్పీలు శేషయ్య, రాంబాబు, థామస్‌రెడ్డి, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement