జనసేన జెండా మోసేవారికి.. మొండిచేయి! | - | Sakshi
Sakshi News home page

జనసేన జెండా మోసేవారికి.. మొండిచేయి!

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

–IIలో జనసేన జెండా మోసేవారికి.. మొండిచేయి! సాలూరు జనసేనలో తిరుగుబాటు వలస పక్షులకే పీఠాలు...

న్యూస్‌రీల్‌

ఎప్పటికీ తోక పార్టీగానే ఉండిపోవాలా..?

–IIలో

రోగులంటే అంత అలుసా..!

విజయనగరం సర్వజన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు సరిగా జరగడంలేదంటూ రోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

శత్రువుతో కలిసి వెళ్లాల్సిందేనా..?

సాలూరు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకుల మధ్య విబేధాలు

తారాస్థాయికి చేరుకున్నాయి.

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సాలూరు జనసేనలో తిరుగుబాటు మొదలైంది. మున్సిపల్‌ చైర్మన్‌ సీటు జనసేనకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.. అభ్యర్థి ఎంపికపై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా నిర్ణయించిన పేర్లను అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అనూహ్యంగా మరో వ్యక్తిని అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకున్నారన్న ప్రచారం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ అభిప్రాయాలను పక్కనపెట్టి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే సామూహిక రాజీనామాలకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. జరజాపు దీప్తి, కిలపర్తి స్రవంతి పేర్లను అభ్యర్థులుగా ప్రతిపాదించి అధిష్టానానికి సూచించినా.. ఫలితం లేకపోయిందని ఆ పార్టీకి చెందిన జె.సూరిబాబు, శివ తదితర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 మంది వరకు కౌన్సిలర్‌ అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని, ఆశావహులంతా నామినేషన్లు వేసుకోవచ్చని సూచించిన నేపథ్యంలో తాము ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన వ్యక్తి పేరును సాలూరు జనసేన మున్సిపల్‌ అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకున్నారన్న వార్త తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అభ్యర్థి ఎంపికపై పునరాలోచన చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జనసేనకు కేటాయించిన చైర్మన్‌ సీటుపై తమ అభిప్రాయాలకు విలువ లేనప్పుడు ఆ సీటు తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. నాగబాబుతో సమావేశంలోనూ అభ్యర్థుల ఎంపికపై తమ అభిప్రాయాలను తెలియజేశామని చెబుతున్నారు. ఇదే సందర్భంలో మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు రెండు నుంచి ఐదు శాతం వరకు ఓటు బ్యాంకు ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రస్తావిస్తూ.. వాస్తవంగా తమ పార్టీకి 20 నుంచి 30 శాతానికి మించిన ఓటు బ్యాంకు ఉందని.. టికెట్‌ కేటాయింపు వ్యవహారమే పార్టీలోని బలాబలాలపై చర్చకు దారితీసిందని పేర్కొంటున్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం :

పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తే చాలు.. ‘సీఎం, సీఎం...’ అంటూ గొంతు చించుకునే అభిమానం వారిది. అధికారం ఉన్నా, లేకున్నా తమ నినాదంలో ఇసుమంతైనా మార్పు ఉండదు. 2024 ఎన్నికల్లో కూటమితో జట్టు కడుతున్నామని అధినేత అంటే.. చంద్రబాబు వైఖరి తెలిసి కూడా మౌనంగా ఉండిపోయారు. సీఎం కాస్త.. డిప్యూటీ సీఎం అయితే... ఏదో ఒక పదవిలే అని సరిపెట్టుకున్నారు. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో తాము కూడా పదవులను అధిరోహించి... ‘మేము జెండా కూలీలమే కాదు.. పదవులు అనుభవించే నాయకులం కూడా’ అని నిరూపించి నలువైపుల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని అనుకున్నారు. ఇప్పుడేమో సీను రివర్స్‌ అయ్యింది. ఇన్నాళ్లూ అధినేతకు ఒక సైన్యంలా ఉన్న తమను కాదని.. పదవుల కోసం పార్టీలోకి వస్తున్న ఇతరులకు సీట్లు ఇవ్వడంపై తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. అధినేత తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. త్యాగాలు టీడీపీ వారికి కాదని.. ప్రతిసారీ తామే చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలో సాలూరు, పాలకొండను పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు కేటాయించిన విషయం విదితమే. పంపకాల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ఎప్పటినుంచో నమ్ముకున్న జనసేన నాయకులను కాకుండా.. ముందు రోజు వచ్చిన వలస పక్షులకు ఇవ్వడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సాలూరు మున్సిపాలిటీలో పలువురు అభ్యర్థులు చైర్మన్‌ సీటు ఆశించినప్పటికీ.. వారిని కాదని పదవి కోసం పార్టీలు మారిన, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన గొర్లె విజయకుమారికి టికెట్‌ కట్టబెట్టడంపై జనసేన కార్యకర్తలు, నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకొండలో సైతం ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా విజయనిర్మలను సీటు ఇస్తామని బతిమలాడుకొని పార్టీలోకి చేర్చుకుంటున్నారని వాపోతున్నారు. అంత సమర్థులు జనసేనలో లేరా.. జెండాలు మోసేందుకే టీడీపీకి, పవన్‌ కల్యాణ్‌కు తాము కావాలా? అని ప్రశ్నిస్తున్నారు.

మున్సిపల్‌ స్థానాల్లో జనసేనకు కేటాయించిన చోట్ల కూడా టీడీపీ నుంచి రాత్రికి రాత్రే కండువా మార్చినవారికే అభ్యర్థిత్వాలు కట్టబెడుతున్నారన్న ప్రచారం క్యాడర్‌ను తీవ్రంగా కలచివేస్తోంది. ఏళ్ల తరబడి కష్టాలను తట్టుకుని జెండా మోసిన తమకు దక్కాల్సిన గుర్తింపు పరాయి పంచన చేరుతోందని జనసేన నాయకులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తమవుతోంది. ‘గత ఎన్నికల్లో టీడీపీకి ప్రాణం పోసింది జనసేన.. తీరా చూస్తే రాష్ట్రంలో మళ్లీ టీడీపీ, వైఎస్సార్సీపీ మాత్రమే మిగిలాయి.. జనసేన నామరూపాల్లేకుండా పోతోంద‘ని పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు పదవుల కోసం డిమాండ్‌ చేస్తుంటే.. జనసేన నాయకులు మాత్రమే ఎల్లప్పుడూ త్యాగాల పేరుతో ‘కూలీలు’గా మిగిలిపోవాలా? అని వాపోతున్నారు. ఇదే కొనసాగితే క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నట్లే అని హెచ్చరిస్తున్నారు. ఇక కూటమిలో ఉన్న బీజేపీకి కూడా అదే పరిస్థితి. రాష్ట్ర స్థాయిలోనే పదవులు అనుభవిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో తమతో పాటు జనసేన క్యాడర్‌ కూరలో కరివేపాకులా మారిపోయిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పార్వతీపురం మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం తమకు కేటాయించకపోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం పార్వతీపురం మున్సిపల్‌ చైర్పర్సన్‌ స్థానానికి తన భార్య ద్వారపురెడ్డి జ్యోతితో నామినేషన్‌ వేయించారు.

వలస నేతలకే పదవుల పందేరం..

చివర వరకు జెండా మోసే కూలీలేనా..?

అధినేతకు అధికారం.. జనసేన నాయకుల ‘త్యాగాలు’

రగిలిపోతున్న జనసేన క్షేత్రస్థాయి కేడర్‌

రాజకీయాల్లో ఎప్పటికీ ‘తోక పార్టీ’గానే మిగిలిపోవాలని ఎవరూ అనుకోరు. సొంత బలంతో ఎదగాలని, అధికారంలో వాటా దక్కించుకోవాలని ఆశిస్తారు. జనసేనలో మాత్రం సీన్‌ రివర్స్‌ కనిపిస్తోంది. ‘పదిహేనేళ్లపాటు సర్దుకుపోవడానికి సిద్ధం’ అంటూ అధినేత పవన్‌ పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయి శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని, ఆత్మ పరిశీలనను రేకెత్తిస్తున్నాయి. కూటమి అధికారంలో ఉన్నా.. తమ ఉనికి ఎక్కడనే ఆవేదన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement