ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలి

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

పార్వతీపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలుచేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ముందస్తు అనుమతి లేకుండా అధికారులు సెలవులకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌సహా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నిరంతరం పనిచేస్తూ, అధికారుల సమన్వయంతో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్‌.వైశాలి, సబ్‌ కలెక్టర్‌లు సచిన్‌ రహార్‌, డీఆర్‌ఓ కె.హేమలత, తదితరులున్నారు.

ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌గా చిన్నరాయుడు

స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా జిల్లాకు జనరల్‌ అబ్జర్వర్‌గా ఐఏఎస్‌ ఎస్‌.చిన్నరాయుడు నియామకమయ్యారు. ఆయన కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. ఎన్నికల ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

ఎన్నికల వ్యయపరిశీలకురాలిగా బబిత కుమారి

జిల్లాకు స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకురాలిగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి బబిత కుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారని, ఎన్నికల వ్యయ నియంత్రణ, నిబంధనల అమలును పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

ఎన్నికల నిమమావళి

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. లౌడ్‌ స్పీకర్‌ల వినియోగం, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement