వాటా అడిగితే తూటా పేల్చారు! | - | Sakshi
Sakshi News home page

వాటా అడిగితే తూటా పేల్చారు!

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

● ఇచ్చినవి తీసుకోండి లేదా వెళ్లిపోండి

● పాయింట్‌ బ్లాంక్‌లో తేల్చి చెప్పిన అదితి

● బిక్కమొహం పెట్టిన జనసేన లీడర్లు

● అయ్యలు ఆర్తనాదాలు... యశస్వి కంటతడి

సాక్షిప్రతినిధి, విజయనగరం:

బహుశా విజయనగరం జిల్లా రాజకీయ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన పరిణామాలు జరుగుతున్నాయి. కూటమిలో తాము భాగస్వాములం... అధికారంలో.. పదవుల్లో మాకు వాటా ఉందని జనసేనవాళ్లు భ్రమిస్తుండగా... వారిని కేవలం బోయీలుగా మాత్రమే భావిస్తున్న తెలుగుదేశం సరిగ్గా టైం చూసి పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి సింగిల్‌ తూటాతో ఎన్‌కౌంటర్‌ చేసేసింది.

కూటమికి అధికారం దక్కడానికి తమ నాయకుడు పవన్‌ ప్రధాన కారకుడని, అందుకే ఆయనకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ప్రాధాన్యం కట్టబెట్టారన్న ఊహల్లో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ వాటా సీట్లు తెచ్చుకోవడానికి అన్నట్లుగా బయల్దేరారు. మొత్తం 62 స్థానాలకు గాను మాకెన్ని... మా సంగతి ఏమిటి? మా వాటా ఎన్ని అన్నట్లుగా దిలాసాగా కూర్చున్నారు. వాటా తేలితే సీట్లు పట్టుకుపోదామని సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని వార్డులను సెలెక్ట్‌ చేసుకుని ఈ వార్డులు మాకే ఇవ్వాలన్నట్లుగా భావిస్తూ కూర్చున్నారు. అందర్నీ ఎగాదిగా చూసిన అదితి మీకు నాలుగైదు సీట్లు ఇస్తున్నాం అంటూ మెల్లగా చెప్పారు. షాక్‌లో ఉన్న జనసేన నాయకులు ఎన్నీ అన్నట్లుగా మళ్లా చూశారు... అదేనమ్మా నాలుగైదు అని అదితి తేల్చి చెప్పేశారు... ఇక దీనిపై బేరసారాలకు తావులేదన్నట్లుగా తేల్చి చెప్పేసి.. ఇంకేమైనా చెప్పాలా ? అన్నట్లుగా చూశారు.. ఆమె తీరు చూసి కరెంట్‌ షాక్‌ తగిలిన కాకుల్లా మారిపోయిన జనసేన నాయకులు, కార్యకర్తలు స్పహలోకి రావడానికి కొన్ని క్షణాలు పట్టింది. ఆ తరువాత కూడా వీళ్లు నోరు మెదపనివ్వకుండా సరే మరి బయల్దేరండి అన్నట్లుగా ఆమె ఉండడంతో కక్కలేక మింగలేక సైలెంట్‌గా అశోక్‌ బంగ్లా నుంచి బయటకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement