కోలాహలంగా ఇందుమతి నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

కోలాహలంగా ఇందుమతి నామినేషన్‌

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

● తరలివచ్చిన పార్టీ నాయకులు

● రెండోవ రోజు 18 నామినేషన్లు

పాలకొండ/పాలకొండ రూరల్‌: పాలకొండ నగర పంచాయతీ నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున పాలవలస ఇందుమతి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు ఆమె నివాస గృహం వద్ద పూజలు నిర్వహించి అక్కడ నుంచి నేరుగా కోటదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల జరిపారు. అక్కడ నుంచి ర్యాలీగా నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు.

భారీగా తరలివచ్చిన నాయకులు

వైఎస్సార్‌ సీపీ తరఫున సీనియర్‌ నాయకుడు పాలవలస రాజశేఖరం భార్య, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు తల్లి అయిన పాలవలస ఇందుమతి చైర్‌పర్స్‌గా నామినేషన్‌ వేయడంతో పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు పరీక్షిత్‌రాజ్‌, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, పార్టీ పాలకొండ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మథరావుతో పాటు పట్టణంలోని పార్టీ శ్రేణులు ఇందుమంతికి మద్దతుగా నిలిచారు.

రెండువ రోజు 18 నామినేషన్లు...

నగరపంచాయతీ పరిధిలో మొదటి రోజు ఏ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. రెండో రోజు శనివారం 18 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైఎస్సార్‌ సీపీ నుంచి 12 నామినేషన్లు పడగా, జనసేన నుంచి రెండు, స్వతంత్రులు 3 నామినేషన్లు వేశారు. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు.

నేటితో నామినేషన్‌లకు ఆఖరు

నామినేషన్‌ గడువు ఆదివారంతో ముగుస్తుంది. ఇంతవరకు సీట్లు సర్దుబాటులో ఎటువంటి పురోగతి లేక పోవడంతో టీడీపీ నుంచి ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. ఇక జనసేన నుంచి రెండు వార్డులకు మాత్రమే నామినేషన్‌లు వేశారు. బీజేపీకి ఏ వార్డులు కేటాయిస్తారో తెలియని స్థితిలో ఉంది. శనివారం రాత్రి సీట్లు సర్దుబాటు చేసి అదివారం నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement