గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

సాలూరు రూరల్‌: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ అల్లు సత్యవతి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వృత్తి విద్య కోర్సుల్లో అఫీస్‌ అసిస్టెన్స్‌షిప్‌ ఒకేషనల్‌ కోర్సులో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గుర్తింపు కలిగిన యూనివర్సిటీలో ద్వితీయ శ్రేణిలో ఎం.కాం పూర్తి చేసిన వారు ఈనెల 22 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 23న 10.30 గంటలకు ఒరిజినల్‌ సిర్టిఫికెట్లతో హాజరు కావా లని సూచించారు. అర్హులైన వారిని మెరిట్‌ ఆధారంగా పోస్టుల్లో భర్తీ చేస్తామని తెలిపారు.

వంజరంపేట పాఠశాల మూసివేత

బలిజిపేట: మండలంలోని వంజరంపేట పాఠశాల మూతబడిందని ఎంఈఓ–1సామల సింహాచలం తెలిపారు. 2026–27విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని ఉండేది. కొంతకాలం గడిచిన తరువాత ఆవిద్యార్థిని కూడా ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్లిపోతుండగా ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఎంఈఓ–1సామల సింహాచలం గ్రామంలో పెద్దలు, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి విద్యార్థిని పాఠశాలకు రాకపోతే పాఠశాల మూతపడే అవకాశాలున్నాయని అందువల్ల గ్రామస్తులు దీనిపై దృష్టిసారించి పాఠశాల మూతపడకుండా సహకరించాలని కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఎవరూ రాకపోవడంతో పాఠశాలను మూసివేసినట్లు తెలిపారు. విద్యార్థిని పేరు డ్రాప్‌బాక్స్‌లో పెట్టివేసినట్లు ఎంఈఓ–1సామల సింహాచలం చెప్పారు.

పలువురు ఇంజినీర్లకు స్థానచలనం, పదోన్నతి

పార్వతీపురం రూరల్‌: తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో బదిలీల పర్వం, పదోన్నతుల ఘట్టం ఆరంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం యంత్రాంగంలో మార్పులు–చేర్పులు చేస్తూ, సంస్థ సీఎండీ ఇమ్మణ్ణి పృథ్వీతేజ్‌ ఆదేశాల మేరకు పలువురు ఇంజినీర్లకు స్థానచలనం, పదోన్నతులు కల్పిస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. పదవులు, బాధ్యతల మార్పుల వివరాలిలా ఉన్నాయి..పాలకొండ ఆపరేషనన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ)గా ఉన్న కె.విష్ణుమూర్తి శ్రీకాకుళం టెక్నికల్‌ ఈఈగా బదిలీ అయ్యారు. పార్వతీపురం ఎస్పీఎం డిప్యూటీ ఇంజినీర్‌ రామకృష్ణ ఈఈగా పదోన్నతి పొంది, పాలకొండకు మారారు. పాలకొండ డిప్యూటీ ఇంజినీర్‌ మోహనర్‌్‌ చక్రవర్తి సైతం ఈఈగా ప్రమోషన్‌న్‌ అందుకుని, కార్పొరేట్‌ కార్యాలయంలో ఓఅండ్‌ఎం బాధ్యతల్లో కొలువుదీరారు. ఏలూరులో విధుల్లో ఉన్న ఎ.చంద్రమౌళికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి ఇచ్చి పాలకొండకు పంపగా, భోగాపురం సహాయ ఇంజినీర్‌ (ఏఈ) ఎస్‌.కె.మస్తాన్‌వలి కొమరాడ ఏఈగా బదిలీ అయ్యారు.

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

పాలకొండ: ఖైదీలకు ఉచిత న్యాయ సహయం అందించేందుకు చర్యలు తీసుకున్నామని శ్రీకాకుళం జిల్లా మూడవ అదనపు జడ్జి వివేకానంద శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక సబ్‌ జైల్‌ను జిల్లా న్యాయ సేవా సంఘం కార్యదర్శి కె హరిబాబు, స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ హరిప్రియలతో కలిసి ఆయన సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతంగా న్యాయవాదులను పెట్టుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జైలు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, అందుబాటులో తాగునీరు ఉంచాలని, ఖైదీలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జైల్‌ సూపరింటెండెంట్‌ రమణయ్యను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement