కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్‌

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

రెవెన్యూ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడిగా శ్రీరామ్మూర్తి

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు మీ కోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని కలెక్టర్‌ సూచించారు.

క్యూఆర్‌ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్‌

పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు.

గ్రామ, వార్డు ఉద్యోగులకు స్పెషల్‌ గ్రేడ్‌ స్కేల్‌

ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఏఏఎస్‌

పార్వతీపురం రూరల్‌: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్‌న్స్‌మెంట్‌ స్కీమ్‌ (ఏఏఎస్‌) ను వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 7 జారీ చేసింది. ఒకే పోస్టు లేదా కేడర్‌లో ఆరేళ్ల అర్హత సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ స్కీమ్‌ కింద ‘స్పెషల్‌ గ్రేడ్‌ పోస్ట్‌ స్కేల్‌’ మంజూరు చేయనున్నారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఏఏఎస్‌ నిబంధనలకు లోబడి ఈ స్కేల్‌ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీఎన్జీజీవోస్‌ అసోసియేషన్‌ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్‌ కిశోర్‌, కార్యదర్శి కె.రంగాచారి స్పందించారు. ఇందుకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, ఏపీజేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌, ఏపీఎన్జీజీవోస్‌ ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన ఆటో: నలుగురికి గాయాలు

సీతానగరం: మండలంలోని చినభోగిలి నుంచి ద్విచక్రవాహనంపై బొబ్బిలి వైపు వెళ్తున్న కుటుంబసభ్యులను వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో నలుగురు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపాన వివరాలిలా ఉన్నాయి. చినభోగిలికి చెందిన రాజాన చంటి తన భార్య, ఇద్దరు పిల్లలతో బొబ్బిలి బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న ఆటో ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చంటి, ఆయన భార్య పిల్లలు రోడ్డుపై పడి పోవడంతో గాయాలయ్యాయి. గాయాలపాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించినట్లు హెచ్‌సీ తిరుపతిరావు తెలియ జేశారు.

పార్వతీపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సేవల సంఘం (అమరావతి) రాష్ట్ర సహాధ్యక్షుడిగా జి.శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం అమరావతిలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీరామ్మూర్తి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనకు ఏపీ జేఏసీ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులతో పాటు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement