బలిజిపేట మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయకుడికి 40లడ్డూలతో మాల తయారుచేసి వేశారు. స్వామివారికి పూలమాలలు తయారుచేయడం, నోట్లను మాలగా తయారుచేసి వేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే లడ్డూల మాలతో స్వామివారిని అలంకరించడం గొప్పగా ఉందని స్థానికులు సంతృప్తి చెందారు. ఈ మాలను ఎంతో ఆశ్చర్యంగా భక్తులు చూశారు. స్థానికుడైన ఒక స్వీట్‌షాపు యజమాని 40లడ్డూలను ఒక మాలగా తయారుచేసి స్వామివారి మెడలో వేశారు. లడ్డూ మాల స్వామివారి మెడలో వేయడం ఇదే ప్రథమమని స్థానికులు తెలిపారు. వినాయకుడి నిమజ్జనం సమయంలో మాలను తీసి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. –బలిజిపేట


