●బ్రహ్మోత్సవాల్లో నృత్య నీరాజనం | - | Sakshi
Sakshi News home page

●బ్రహ్మోత్సవాల్లో నృత్య నీరాజనం

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

●బ్రహ్మోత్సవాల్లో నృత్య నీరాజనం

గ్రామస్తులతో మొట్టికాయలు

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

రాజాం బాలభవన్‌లో నాట్య శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శభాష్‌ అనిపించారు. ఆదివారం హనుమత్‌ వాహన సేవలో పాల్గొని తమ నృత్య ప్రదర్శనలతో స్వామికి నృత్య నీరాజనం అందించారు. విద్యార్థినులతో పాటు బాలభవన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుంకరి రమేష్‌, డ్యాన్స్‌ మాస్టరు తారక్‌లను పలువురు అభినందించారు.

– రాజాం

సాక్షి, పార్వతీపురం మన్యం: అధికార పార్టీ నేత మెప్పు పొందాలనే అత్యుత్సాహంతో కొందరు ’తెలుగు తమ్ముళ్లు’ సొంత ఊరిలోనే పరువు పోగొట్టుకున్నారు. తమ సొంత ప్రభుత్వంలోనే.. కలెక్టర్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఫేక్‌ ఆడియోలు, వీడియోలతో కుట్రకు తెరలేపి అడ్డంగా దొరికిపోయారు. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ నిధుల వసూళ్ల పేరిట స్థానిక అధికార పార్టీ నేతలు ఒక కట్టుకథకు రూపకల్పన చేశారు. పార్వతీపురం మండలంలో గల లక్ష్మీనారాయణపురం గ్రామంలోని ఒక చోటా నాయకుడి దర్శకత్వంలో.. ఉపాధి హామీ కూలీల వద్ద నుంచి, వారి ఆధ్వర్యంలోనే స్వయంగా డబ్బులు వసూలు చేసి, ఆ నెపాన్ని కలెక్టర్‌పై నెట్టేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఫేక్‌ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలాంటి విష సంస్కృతికి తెరలేపడంపై గ్రామస్తులు, వేతనదారులు తీవ్రంగా మండిపడ్డారు. వారే వసూళ్ల డ్రామా ఆడుతూ, అధికారులపై నిందలు వేయడాన్ని తప్పు పడుతూ, ఆ నేతలను నిలదీశారు. ఇలాంటి పనుల వల్ల ఊరికి చెడ్డ పేరు వస్తుందని కలత చెందారు. దీంతో ఆ గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. జిల్లా స్థాయి అధికారిపైనే ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగట్టడంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ఇటీవల మంత్రి ఆధ్వర్యంలో ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకునే కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి మాట్లాడారు. ఫేక్‌ కథనాలతో ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కలెక్టర్‌ హెచ్చరించి రెండు రోజులు తిరగక ముందే, ఏకంగా ఆయన్నే లక్ష్యంగా చేసుకుని విష ప్రచారానికి తెర తీయడం గమనార్హం. ఈ ప్రచారంపై విచారణ నిమిత్తం త్వరలోనే అధికారిక బృందం ఆ గ్రామానికి వెళ్లనుంది. నాయకుల మెప్పు కోసం స్వామి భక్తి చాటుకునేందుకు వెళ్లి, చివరికి తమ గ్రామంలోనే స్థానికులు ముందు నిందితులుగా నిలబడాల్సిన దుస్థితిని ఆ నాయకులు స్వయంగా కొనితెచ్చుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

కలెక్టరును ఇరికించే ప్రయత్నంలో..

తమ్ముళ్ల అత్యుత్సాహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement