పార్వతీపురం రూరల్: జిల్లాలోని 15 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను డీఎల్‌డీవో త్రివిక్రమరావు ఆధ్వర్యంలో అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ప్రజలు, పోటీ చేసే అభ్యర్థుల సమాచారం నిమిత్తం ఈ పోలింగ్ కేంద్రాల పూర్తి వివరాలను కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. పౌరులందరూ ఈ తుది జాబితాను పరిశీలించి, తమ పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో పార్వతీపురం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


