చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

బొబ్బిలిరూరల్‌:

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా వారి హక్కుల పరిరక్షణ జరుగుతుందని జిల్లా జడ్జి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు శనివారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవసరమన్నారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహ కల్పించాలన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను పాందడం పౌరుల ప్రాథమిక హక్కని అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలు, వారి హక్కుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జిలు కృష్ణ ప్రసాద్‌, రాధాకృష్ణ మూర్తి, స్థానిక న్యాయ మూర్తులతో పాటు బార్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు బి.రవి, ఎంపీడీఓ రవికుమార్‌, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా జడ్జి ఎం బబిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement