సంతోష్‌ది హత్యే | - | Sakshi
Sakshi News home page

సంతోష్‌ది హత్యే

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

సంతోష్‌ది హత్యే

బొబ్బిలి: ఈనెల 9 న అర్ధరాత్రి మండలంలోని పారాది వంతెన వద్ద అదే గ్రామానికి చెందిన ఉత్తరావిల్లి సంతోష్‌ కుమార్‌(30)ను అతని స్నేహితుడే హత్య చేసినట్లు డీఎస్పీ ఆర్‌ గోవిందరావు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 9న సంతోష్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, బంధువులు తమకు సమాచారం ఇచ్చారని, ఈ సంఘటనను అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేసినట్లు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంలతో చేపట్టిన దర్యాప్తులో సంతోష్‌ను అతని స్నేహితుడు అల్లాడ పైడిరాజు హత్య చేసినట్లు తెలిపారు. నిత్యం వారిద్దరూ వంతెన సమీపంలో మద్యం తాగుతుంటారని ఈ క్రమంలో ఈనెల 9న మద్యం తాగుతూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో వారి మధ్య ఘర్షణ జరిగిందన్నారు. తనను అవమానపర్చాడన్న కోపంతో ఉన్న పైడిరాజు అప్పటికే మద్యం మత్తులో పడి ఉన్న సంతోష్‌ను అక్కడున్న కర్రతో తలపై గట్టిగా కొట్టి వెళ్లిపోయాడన్నారు. దీంతో సంతోష్‌ మృతి చెందాడన్నారు. పైడిరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. దర్యాప్తులో సీఐ కె.నారాయణ రావు, ఎస్సై డి.కొండల రావు, సిబ్బంది చూపిన చొరవను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

డీఎస్పీ గోవిందరావు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement