క్రీడాకారుల భవితతో.. ఆటలు! | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల భవితతో.. ఆటలు!

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

● విజయనగరంలో ఇటీవల ఓ క్రీడకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంపికలు జరిగాయి. నామమాత్రంగా పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాప్రా ధికార సంస్థకు, క్రీడా అధికారులకు పోటీల వివరాల సమాచారం లేదు. కేవలం రాజకీయ నాయ కులను ముఖ్యఅతిథిగా పిలిపించి తమకు నచ్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

● ఓ క్రీడకు సంబంధించి రెండు నుంచి మూడు సంఖ్యలో అసోసియేషన్లు ఉన్నా యి. ఒక్కో ప్రాంతానికి, ఒక్కో వీధికి ఒక్కో అసోసియేషన్‌ ఉంది. వీరంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉపయోగ పడని ధ్రువపత్రాలు ఇస్తున్నారు.

కీడాకారులు ఇవి తెలుసుకోవాలి

పోటీల్లో పాల్గొనే ముందే సంబంధిత సంఘానికి గుర్తింపు ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని సంప్రదించాలి. క్రీడా యాప్‌లో వ్యక్తిగతంగా నమోదు అయితే తెలుసుకోవచ్చు. వీటి నిర్వహణ తీరు సంతృప్తికరంగా లేకపోతే విజయవాడలోని శాప్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చు.

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

నిబంధనలు పాటించే అసోసియేషన్‌లు ఎన్ని....?

గుర్తింపు పొందాల్సిందే..

ప్రతి క్రీడా సంఘం తప్పనిసరిగా గుర్తింపు పొందాల్సిందేనని శాప్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సంఘాల వివరాలు క్రీడా యాప్‌లో నమెదు చేసుకోవాలి. అలా గుర్తింపు పొందిన సంఘాలకు మాత్రమే జిల్లా స్థాయి గుర్తింపు వస్తుంది. రెండు, మూడు సంఘాలు ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపడుతున్నాం. క్రీడాకారులు గుర్తింపు సంఘాల నిర్వహించే పోటీల్లో పాల్గొంటేనే వారి ధ్రువపత్రాలకు విలువ ఉంటుంది. లేనిపక్షంలో నష్టపోతారు.

– ఎస్‌.వెంకటేశ్వరరావు,

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, విజయనగరం

విజయనగరం: తమ పిల్లలు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. దీనికోసం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తారు. పతకాలు సాధిస్తే ఆనంద పడతారు. ఉజ్వల భవిత లభిస్తుందని ఆశ పడతా రు. తాజాగా కూటమి ప్రభుత్వంలో చేపట్టిన మెగా డీఎస్సీలో స్పోర్ట్‌ కోటాలో చేపట్టిన ఉపాధ్యాయుల నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం క్రీడల్లో పతకాలు సాధించిన, ప్రతిభ చూపిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అసోసియేషన్ల పేరుతో కొన్నాళ్లుగా సాగుతున్న దందా చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ చూపే క్రీడా కారులను పక్కనపెట్టి క్రీడా అసోసియేషన్ల పేరుతో పలువురు సాగిస్తున్న వ్యాపారం క్రీడాలోకాన్ని విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దల సాక్షిగా సాగుతున్న క్రీడాకోటాలో ఉద్యోగవ్యాపారం ఆవేదనకు గురిచేస్తోంది. పోటీలో పాల్గొని గెలవకపోయినా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినట్టు సర్టిఫికెట్‌లు ఇవ్వడం విస్తుపరుస్తోంది. ఎంత మొత్తంలో చేతులు మారకుంటే ఈ తరహా దందాకు దిగుతారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

గుర్తింపు లేని అసోసియేషన్‌లే ఎక్కువ..!

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారిక లెక్కల ప్రకారం మొత్తంగా 37 క్రీడా అసోసియేషన్లు ఉన్నాయి. ప్రతి క్రీడకు ఒక అసోసియేషన్‌ ఉంటుంది. ఒలింపిక్‌ సంఘం అనుసంధానంగా క్రీడా సంఘాలు ఉంటాయి. ఇవి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న అసోసియేషన్లకు అనుసంధానమై ఉంటాయి. ఏటా అండర్‌–12, 14, 17, 19 పాఠశాల, కళాశాల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని మండలాల వారీగా ఎంపిక చేసుకుని జిల్లాస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం కల్పిస్తారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి, అక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అవకాశం వస్తుంది. ఇక్కడ జారీ చేసే ధ్రువపత్రాలు ఎంతో విలువైనవి. ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. అయితే, 37 క్రీడా సంఘాల్లో 2025 సంవత్సరంలో రెన్యువల్‌ చేయించుకున్న సంఘాలు 9 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 28 సంఘాల వాటి గుర్తింపును రెన్యువల్‌ చేయించుకోలేదని, మరికొన్ని గుర్తింపుకూడా పొందలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన పరిశీలిస్తే అనధికారి అసోసియేషన్‌లు క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుతున్నట్లు తెలుస్తోంది.

గుర్తింపు లేని సంఘాలతో

క్రీడాకారులకు అన్యాయం

రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెన్యువల్‌

చేయించడంలో నిర్లక్ష్యం

ఈ సంగతి తెలియక మోసపోతున్న

క్రీడాకారులు

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత కల్పిస్తామంటూ వసూళ్ల దందా

మెగా డీఎస్సీలో వెలుగులోకి వచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో సర్వత్రా ఆందోళన

ఇకపై గుర్తింపు తప్పనిసరి అంటున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారులు

రాష్ట్ర క్రీడా సంఘాల గుర్తింపు క్రమబద్ధీకరించకపోవడంతో వందలాదిమంది సీనియర్‌ జాతీయస్థాయి క్రీడాకారులు ఆటలో శ్రమించి సాధించిన ధ్రువపత్రాలు పనికి రావడం లేదు. ఒకవైపు అసో సియేషన్‌ ప్రతినిధుల నిర్లక్ష్యం, మరోవైపు ఆధిప త్య పోరుతో క్రీడాకారుల జీవితాలు అంధ కారమయమవుతున్నాయి.వాస్తవానికి ప్రతి పోటీకి ఒలింపిక్‌ అసోసియేషన్‌ నుంచి ప్రతినిధి, అలాగే క్రీడా అధికారులు రావాల్సి ఉంటుందన్నది నిబంధన. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక్కో క్రీడకు మూడు, నాలుగు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని నామ మాత్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సాధారణ విషయం కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు హాజరవుతారు. రెండు, మూ డు రోజుల వరకు పోటీలు జరుగుతాయి. హాజరైన క్రీడాకారులతో పాటు శిక్షకులకు భోజన వసతితో పాటు బాల బాలికలకు వేర్వేరుగా వసతి కల్పించాల్సి ఉంది. నామమాత్రంగా పోటీలు నిర్వహించి మిన్నకుండి పోతున్నారు.

ప్రయోజనాలు ఇలా..

గుర్తింపు ఉన్న క్రీడా సంఘాల్లో ఉంటే ప్రభు త్వం నుంచి ఆర్థిక సాయం, క్రీడాసామగ్రి అందుతుంది. గ్రూప్‌–1, గ్రూప్‌–2, డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు క్రీడాకోటాలో రిజర్వేషన్‌ లభిస్తుంది. శాప్‌ గుర్తింపు లేకుండా, రెన్యువల్‌ చేయకుండా పోటీలు నిర్వహించకూడదు.

సర్టిఫికెట్‌ ఉంటే చాలా....?

రాష్ట్రస్థాయి పోటీల్లో ఓడినా, గెలిచినా.. పాల్గొన్నా ధ్రువపత్రం కోసం ప్రస్తుతం జిల్లా ఎంపికల్లో ప్రాధాన్యత కనపడుతోంది. ప్రతిభ లేకున్నా సరే.. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొన్న అనంతరం రాష్ట్రస్థాయి పాల్గొన్నారనే ధ్రువపత్రం కోసం కొందరు తహతహలాడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని పలు అసోసియేషన్లు సొమ్ముచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని అసోసియేషన్లు స్పోర్ట్స్‌ కోటా కింద పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటూ తల్లిదండ్రులకు ఆశ చూపి భారీగానే దండుకుంటున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement