రాజన్న! | - | Sakshi
Sakshi News home page

రాజన్న!

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 రాజన్న! ● ప్రజల గుండెల్లో దివగంత నేత వైఎస్సార్‌కు శాశ్వత స్థానం ● ఘనంగా మహానేత వైఎస్సార్‌ వర్ధంతి ● నివాళులర్పించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, అభిమానులు చెరగని సంతకం..

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
● ప్రజల గుండెల్లో దివగంత నేత వైఎస్సార్‌కు శాశ్వత స్థానం ● ఘనంగా మహానేత వైఎస్సార్‌ వర్ధంతి ● నివాళులర్పించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, అభిమానులు

వైఎస్సార్‌కు నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పార్టీ శ్రేణులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

‘రాజన్న లాంటి నాయకుడు మళ్లీ ఎప్పుడు వస్తాడు?’.. దివగంత నేతను అభిమానించే ప్రతి గుండె... చేసిన మేలును మరువలేని ప్రతి మనసూ పదేపదే అడుగుతున్న మాట ఇదే. వైఎస్సార్‌ వెళ్లిపోయి 17 ఏళ్లు దాటినా.. ఆయన పేరు ఇంకా చెక్కు చెదరలేదు. మనసున్న మారాజు, ప్రాణప్రదాత, ఆరోగ్య ప్రదాత.. అంటూ ఒక్కొక్కరూ ఒక్కోలా ఆయనను కీర్తిస్తూనే ఉన్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లాలోని వాడవాడలా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు ఘన నివాళులు అర్పించారు. సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో బోసుబొమ్మ కూడలి వద్ద ఉన్న సుభాష్‌ చంద్రబోస్‌, డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మక్కువ, పాచిపెంట, మెంటాడ మండలాల్లోనూ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వ ర్యంలో వైఎస్సార్‌ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. పండ్లు పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సీతానగరం, బలిజిపేటలోనూ కార్యక్రమాలు సాగాయి. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి నిర్వహించారు. వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల్లోనూ పార్టీ నాయకులు పాల్గొని, రాజన్నకు నివాళులు అర్పించారు. కురుపాం నియోజక వర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు పిలుపు మేరకు కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల్లో స్థానిక నాయకులు వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement