విజయనగరం గంటస్తంభం: వినియోగదారుల హక్కుల పరిరక్షణలో రాజీలేకుండా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. నాణ్యత, తూకం, కొలతలు, ధరలు, ఆహార పదార్థాలపై నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. అక్రమ వాటర్ ప్లాంట్లు, కల్తీ ఆహారం, రేషన్ బియ్యం అక్రమరవాణా, గ్యాస్ సిలిండర్ల తూకంలో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్‌తో కూడిన కరపత్రాన్ని, డీసీపీసీ సభ్యుల విధులు, బాధ్యతల పుస్తకాన్ని ఆవిష్కరించారు.


