పాలకొండ రూరల్: ఏపీ శాసన మండలి లోని ‘ఆన్ పేపర్స్ లెడ్ ఆన్‌ది టెబుల్ కమిటీ’లో సభ్యునిగా ఉన్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు కమి టీ చైర్మన్‌గా బాధ్యత లు అప్పగించారు. ఈ మేరకు మండలి సెక్రట రీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో ఇటీవల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే క్రమంలో విక్రాంత్‌కు చైర్మన్‌గా, మరో ఎమ్మెల్సీ డా.సిపా యి సుబ్రహ్మణ్యంను సభ్యునిగా నియమించా రు. విక్రాంత్‌కు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, నాలుగు మండలాల వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు కనపాక సూర్యప్రకాష్, దమలపాటి వెంకటరమణ నాయుడు, బోదెపు శ్రీనివాసరా వు, కె.వెంకునాయుడు, వెలమల మన్మథరా వు, పార్టీ క్యాడర్ అభినందనలు తెలిపారు.
పార్వతీపురం రూరల్: మా తొలి ప్రాధాన్యం చర్చలే.. ప్రభుత్వం స్పందించకపోతే కదనరంగంలో తేల్చుకుంటామని ఏపీ జేఏసీ పార్వతీ పురం మన్యం జిల్లా చైర్మన్ జీవీఆర్‌ఎస్ కిశోర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌లో జరిగిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పక్షాన గళమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సంయమనం పాటించామన్నారు. పాత బకా యిలు రూ.20 వేల కోట్లు చెల్లించడం, మెమో 57 ద్వారా 11 వేల మందికి పాత పింఛను వంటి నిర్ణయాలు తీసుకున్నా.. ప్రస్తుతం పనిచేస్తు న్న వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదన్నారు. తెలంగాణతో పోలిస్తే వేతనాల్లో 25 శాతం వ్యత్యాసం ఉందన్నారు. 2023 జులై నాటికే రావాల్సిన పీఆర్సీ ఊసేలేదని, 5 డీఏ లు, 3 సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయ ని, సీపీఎస్ సమీక్ష హామీ అటకెక్కిందని ఆవేద న వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, అదనపు పింఛను వంటి హక్కుల పునరుద్ధరణకే ఈ పోరాటమని స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని, లేనిపక్షంలో ఈ నెల 5న విజయవాడలో రాష్ట్ర ఛైర్మన్ ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాము, రంగాచారి, సూర్యనారా యణ, త్రినాథ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం రూరల్: కళాశాలల్లో నిర్వహిస్తు న్న ఉద్యోగమేళాలో పాల్గొని, వచ్చిన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని జేఎన్‌టీయూ జీవీ ఉపకులపతి డాక్టర్ వి.వి.సుబ్బారావు అన్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరంగ్ కళాశాలలో ఐటీ విభాగం చివరి సంవత్సరం విద్యార్థులకు సాంఖ్య టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రీ– ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూల ను బుధవారం నిర్వహించింది. ఎంపికై న వారికి వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌ను అందిస్తామని, అనంతరం రెగ్యులర్ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపా రు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందు బాటులోకి తెచ్చిన ఐటీ విభాగాధిపతి డాక్టర్ బి.తిరుమలరావును వీసీతో పాటు రిజిస్ట్రార్ కేసీబీ రావు, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశా ల ప్రిన్సిపాల్ వీఎస్ వకుళ అభినందించారు.
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఐదో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టి.వి.గిరి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ‘సబ్మిషన్స్.ఓపీ.జీఓవి.ఐఎన్/ఐటీఐ’ వెబ్‌సైట్‌లో ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రిజస్టర్ అయిన తరువాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ/ప్రైవేటు ఐటీఐ కేంద్రాలకు వెళ్లి ఒరిజినల్ ధ్రు వపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసుకొని కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.


