భద్రగిరి సీహెచ్‌సీలో ఇన్వెర్టర్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

భద్రగిరి సీహెచ్‌సీలో ఇన్వెర్టర్‌ ఏర్పాటు

Aug 28 2026 1:15 AM | Updated on Aug 28 2026 1:15 AM

భద్రగిరి సీహెచ్‌సీలో ఇన్వెర్టర్‌ ఏర్పాటు గారమ్మతల్లికి కిరణ స్పర్శ ఫిన్లాండ్‌ విద్యా విధానం భేష్‌

గుమ్మలక్ష్మిపురం: మండలంలోని భద్రగిరి సామాజిక ప్రభుత్వాస్పత్రికి విద్యుత్‌ అంతరా యం సమయంలో సేవలందించేందుకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం ఓ బాలుడికి సెల్‌ఫోన్‌ లైట్‌ల వెలుగుతో చికిత్స అందించారు. ఇదే విషయంపై ‘సెల్‌పోన్‌ వెలుగు లో బాలుడికి వైద్యం’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌ పేజీలో ప్రచురితమైన వార్తకు డీసీహెచ్‌ఓ జి. నాగభూషణ్‌ స్పందించారు. తక్షణమే ఇన్వెర్టర్‌ సదుపాయం కల్పిలంచాలని అధికారులను ఆదేశించారు. పాత ఆస్పత్రిలో ఉన్న జనరేటర్‌ నుంచి కొత్త భవనానికి కనెక్షన్‌ ఇచ్చారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందిస్తామని వైద్యుడు అనిల్‌ తెలిపారు.

పాలకొండ రూరల్‌: పాలకొండ గ్రామదేవత గారమ్మతల్లి విగ్రహాన్ని భానుడి లేలేత కిరణాలు గురువారం స్పర్శించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

జియ్యమ్మవలస రూరల్‌: ఫిన్లాండ్‌ విద్యావిధానం భేష్‌గా ఉందని ఎర్ర శంకరరావు తెలిపారు. ప్రభుత్వం ఇటీవల 29 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఫిన్లాండ్‌ ఎక్స్పోజర్‌ విజిట్‌కు పంపించింది. ఈ నెల 17 నుంచి 26వ వరకు ఫిన్లాండ్‌లో ఉన్న తుర్కుయూనివర్సిటీలో వీరంతా శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ఫిన్లాండ్‌లో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా విద్యార్థి కేంద్రీకృత, ఆట ఆధారిత, పరీక్షలు లేని విద్యా విధానం అమలులో ఉందని, విద్యార్థులు జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. లైఫ్‌ స్కిల్స్‌కు, వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement