రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

Aug 28 2026 1:15 AM | Updated on Aug 28 2026 1:15 AM

రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

పార్వతీపురం రూరల్‌: దక్షిణ కోస్తా రైల్వే విశాఖప ట్నం డివిజన్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌ బోహ్రా గురువారం పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద చేపడుతున్న వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని అన్ని శాఖల బ్రాంచ్‌ అధికారులతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు, సుఖమయ ప్రయాణ అనుభూతి ని అందించడమే లక్ష్యంగా చేపట్టిన పలు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, భద్రతా సూత్రాలు పాటిస్తూ, నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్టేషన్‌ పరిసరాల ప్రాంగణ వికాసం, ప్రయాణికుల రాకపోకల సులభతర ప్రాప్యత, పరిశుభ్రత నిర్వహణ, భద్రతా వసతులపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలు, మెరుగైన ప్రయాణ వసతులతో పార్వతీపురం రైల్వే స్టేషన్‌్‌ను ఆధునిక ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విశాఖ డివిజన్‌ కట్టుబడి ఉందని డీఆర్‌ఎం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement